Hema: డ్రగ్స్ కేసులో సంచలన వీడియో షేర్ చేసిన నటి హేమ.. పరువు కోసం చచ్చిపోతానంటూ

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-16 09:27 GMT

దిశ, సినిమా: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో తాను వేరే చోట ఉన్నానని డ్రగ్స్ తీసుకోలేదని ఓ వీడియో విడుదల చేసింది. అయితే అప్పుడు పార్టీలో పాల్గొందని, డ్రగ్స్ తీసుకుందని పోలీసులు కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ చేసి కొన్నాళ్లు జైల్లో ఉంచారు. దీంతో బెయిల్‌పై ఆమె కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఇటీవల మళ్లీ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆమెకు పోలీసులు ఛార్జీషీట్ వేసినట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, హేమ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘అందరికీ నమస్కారం. గతంలో ఎలాగైతే పాజిటివ్ వచ్చిందని మీడియా వాళ్లు ఏదైతే ప్రచారం చేశారో.. అదే పాత న్యూస్‌ను తీసుకొచ్చి మళ్లీ ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఛార్జీషీట్‌ను నేనే చూడలేదు. అది నా చేతికి రాలేదు.

సో అలాంటిది మీ చేతికి ఎలా వచ్చింది. మీరు ఇలాంటి వార్తలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ చానల్‌లో మళ్లీ పాత వార్తలు రాస్తున్నారు. అయితే ఓ వ్యక్తి నా గురించి ఓ న్యూస్ వేశారు. అతనికి ఫోన్ చేసి నా న్యూస్ వేయకండి అంటే మాకు పోలీసులు ఇచ్చారని ఫైర్ అయ్యాడు. దీంతో నేను అతన్ని కలవడానికి వెళ్లాను. కానీ అక్కడ అతను లేడు. అందరినీ అడిగాను కానీ వెళ్లిపోయాడని చెప్పారు. నేను వస్తున్నాను అని చెప్పిన తర్వాత కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అక్కడ నేను ఎలా వేస్తారు అని గొడవ చేశాను. నాకు అయితే నెగిటివ్ వచ్చింది. అయినా మీరు అలాంటి వార్తలు రాస్తున్నారు.

కాబట్టి నేనే మీ చానల్ వద్దకు వస్తాను మీరే టెస్ట్ చేయించండి అని ఓ వ్యక్తి ఫోన్ చేస్తే చెప్పాను. అప్పుడు నాకు పాజిటివ్ వస్తే మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా. అదే నెగిటివ్ వస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి అని చెప్పా. అన్ని పెద్ద పెద్ద చానల్స్ నాపై వార్తలు వేస్తున్నారు. దయచేసి  నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. నాకు టెస్టులు చేపించండి. మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. మీ వల్ల మా అమ్మ ఆరోగ్యం పాడైంది. నేను పరువు కోసం చచ్చిపోతా. నా ఫ్యామిలీ తలదించుకునే పని ఏ రోజు చేయను. ఇప్పుడు కూడా చేయలేదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ హేమ వీడియో సంచలనం సృష్టిస్తోంది.

Full View

(Video credits to actress Hema's Instagram channel)


Similar News