పెళ్లైన మూడు నెలలకే భర్తతో నటి విడాకులు?.. దాని గురించి మాట్లాడదలుచుకోలేదంటూ షాకింగ్ పోస్ట్

గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా విడాకుల వార్తలే దర్శనమిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలో కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్ది రోజులు కాగానే విడాకులు తీసుకుని విడిపోతున్నారు.

Update: 2024-05-28 06:34 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా విడాకుల వార్తలే దర్శనమిస్తున్నాయి. అయితే ఇండస్ట్రీలో కొందరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొద్ది రోజులు కాగానే విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇటీవల ఎంతో మంది సెలబ్రిటీలు డైవర్స్‌ను అధికారికంగా ప్రకటించి షాకిచ్చిన విషయం తెలిసిందే. కొందరు మాత్రం ఇండైరెక్ట్‌గా పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత వారు క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రముఖ నటి దివ్య అగర్వాల్ తన భర్తతో విడాకులు తీసుకుని విడిపోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దానికి కారణం దివ్య సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో అంతా విడాకులు తీసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు.

తాజాగా, డైవర్స్ రూమర్స్‌పై దివ్య స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ దీని గురించి నేనేం మాట్లాడ దలుచుకోలేదు. నేను పెళ్లి ఫొటోలు మాత్రమే తొలగించలేదు. వాటితోపాటుగా 2500 పోస్టులను డిలీట్ చేశాను. కానీ మీడియా వారు మాత్రం వాటిలో నా పెళ్లికి సంబంధించిన ఫొటోలపైనే ఫోకస్ పెట్టారు. ఇదంతా చూస్తుంటే నాకు ఫుల్ నవ్వొస్తుంది. చాలా మంది ఊహించని విషయాన్ని నేను చేశాను. ఇప్పుడు వాళ్లు నా నుంచి పిల్లలు లేదా విడాకులు కోరుకుంటున్నారా? అది అసలు జరగదు.

నిజం ఏంటంటే.. నేను నా మొదటి ప్రొఫైల్‌లో పిన్ చేసిన పోస్ట్ గురించి నేను ఇప్పటి నుంచి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి సినిమా ఆనందంగా ముగుస్తుంది. దేవుడి దయతో నా భర్త నా పక్కన కీర్తికి దూరంగా గురక పెడుతున్నాడు’’ అని రాసుకొచ్చింది. కాగా, దివ్య అగర్వాల్ నాలుగేళ్లు వరుణ్ సూద్‌తో ప్రేమలో ఉంది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. 2023లో వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌ను ప్రేమించి నిశ్చితారం కూడా చేసుకుంది. కానీ పెళ్లి మాత్రం 2024 ఫిబ్రవరిలో చేసుకుని వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. అయితే పెళ్లైన మూడు నెలలకే విడాకుల వార్తలు రావడంతో స్పందించి క్లారిటీ ఇచ్చింది.

 


Similar News