కల్కిపై అలాంటి పోస్ట్ పెట్టిన నటి.. ప్రభాస్‌ను ఘోరంగా అవమానించిందంటూ ఫ్యాన్స్ ఫైర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘కల్కి2898ఏడి’. ఇందులో పలువురు స్టార్స్ నటించారు.

Update: 2024-07-02 15:12 GMT

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘కల్కి2898ఏడి’. ఇందులో పలువురు స్టార్స్ నటించారు. అయితే ఈ మూవీ జూన్ 27న విడుదలై భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాపై చాలా మంది సినీ సెలబ్రిటీలు ఇందులో నటించిన నటీనటులపై, డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే కల్కి రూ. 600 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. తొందరలో రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో.. కల్కిలో నటించిన నటి అన్నాబెన్ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఓ నెటిజన్ కల్కిపై ఇచ్చిన రివ్యూ షేర్ చేసింది. కానీ అందులో ప్రభాస్ నటనను కించపరిచే విధంగా చెప్పాడు. కానీ దానిని అన్నాబెన్ చూసుకోకుండా స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో.. డార్లింగ్‌ను ఘోరంగా అవమానించని అంతా అనుకుంటున్నారు.

అసలు పోస్టులో ఏముందంటే.. ‘‘ అమితాబ్ సర్‌ది లైఫ్ టైమ్ క్యారెక్టర్. చాలా ఆనందంగా అనిపించింది. ఆయనను తెరపై చూడటం కోసమైనా కల్కి సినిమాను మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాను. నాకు అమితాబ్ కనిపించిన ప్రతిసారి కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఇక కమల్ హాసన్ నాకు సెనేటర్ వైబ్స్ ఇచ్చారు. ఆయన పాత్రలో చాలా పర్‌ఫెక్ట్‌గా నటించారు. సినిమా మొత్తం స్టార్స్ వార్‌లా అనిపించింది. చలనచిత్ర ప్రపంచానికి అభిమాని కావడం వల్ల కల్కి చూడటం చాలా మంచి అనుభూతిని కలిగించింది. అలాగే సహజమైన స్త్రీ పాత్రలు దీపికా పదుకొణె ఆమె అలా నటిస్తుందని అనుకోలేదు. పాత్రలో లీనమైపోయింది. నా ఫేవరెట్ గర్ల్ బెనన్నా లవ్, వాట్ ఎ ఫైర్ క్రాకర్ ఫెర్ఫార్మెన్స్ అన్ని సీన్స్‌లో మ్యాడ్ మ్యాక్స్ మూవీ సిరీస్ వైబ్‌లను దక్కించుకుంది.

ఇంత గొప్ప సినిమాలో అన్నా బెన్, శోభన ఈ లెజెండ్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చూసి చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ తొలగించి సినిమాను నిజమైన క్లాసిక్‌గా మార్చవచ్చని నేను భావించాను. ప్రభాస్ తమాషాగా చేసిన కామెడీ చాలా భయంకరంగా అనిపించింది. మూవీ ఫీల్‌కి ఏమాత్రం సరిపోని సాంగ్ సీక్వెన్స్. అంతేకాకుండా ఇది కేవలం సినిమా మేకింగ్‌లోఅద్భుతంగా ఉంది. భారతీయ సినిమాని సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది నాగ్ అశ్విన్’’ అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ను అన్నా బెన్ చూసుకోకుండా షేర్ చేయడంతో ఫ్యాన్స్ అమ్మడుపై ఫైర్ అవుతున్నారు. డార్లింగ్‌ను అవమానించిందని అంటున్నారు.

 

Read More..

నా కోసం ప్రభాసే స్వయంగా ఆ పని చేశాడు.. నటి ఆసక్తికర కామెంట్స్ 

Similar News