అతడితో సహజీవనం చేసి మోసపోయా: స్టార్ హీరోయిన్
కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి ఆండ్రియా. ఇటీవల వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి చేతిలో ప్రస్తుతం పది సినిమాలు ఉన్నాయి.. Latest Telugu News
దిశ, సినిమా: కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి ఆండ్రియా. ఇటీవల వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి చేతిలో ప్రస్తుతం పది సినిమాలు ఉన్నాయి. ఇక సినిమాలతో బిజీ బిజీగా ఉంటూ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది అమ్మడు ఆండ్రియా. తరచూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును మత్తెక్కిస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ' నేను గతంలో ఒక వ్యక్తిని ఇష్టపడి సహజీవనం చేశాను. కానీ, ఆ వ్యక్తి నన్ను చాలా దారుణంగా మోసం చేశాడు. అప్పుడు నాకు 20 ఏళ్ళు. అప్పటి నుంచి నేను ఎవరిని ప్రేమించలేదు.. ఇక మీదట ప్రేమించను కూడా. నా దృష్టిలో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు హ్యాపీగా లేరు.' అంటూ తన జీవిత అనుభవాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది.
Read More: నటిని రేప్ చేస్తానని బెదిరించిన యువకుడు.. చివరికి అలా చేసి..