శ్రీలీలను పెళ్లి చేసుకోవద్దంటున్న తల్లి.. సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటూ..
‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్‌లో ఓవర్ నైట్‌స్టార్‌గా మారిన శ్రీ లీల తనదైన స్టైల్‌లో దూసుకుపోతోంది. ఇప్పుడున్న హీరోయిన్‌లకు గట్టి పోటీని ఇస్తోంది. ఇక వరుసగా స్టార్‌హీరోలతో 12 సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్ పరంగా టాలెంట్ చూపిస్తున్న
దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్‌లో ఓవర్ నైట్‌స్టార్‌గా మారిన శ్రీ లీల తనదైన స్టైల్‌లో దూసుకుపోతోంది. ఇప్పుడున్న హీరోయిన్‌లకు గట్టి పోటీని ఇస్తోంది. ఇక వరుసగా స్టార్‌హీరోలతో 12 సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్ పరంగా టాలెంట్ చూపిస్తున్న ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ తాజాగా వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. మనకు తెలిసినంత వరకు శ్రీ లీల తల్లి తన భర్తకు విడాకులిచ్చి కూతురితో కలిసి ఉంటోంది. అయితే జాతకం ప్రకారం తనతల్లి లాగానే శ్రీ లీలకు కూడా మ్యారీడ్‌లైప్ ఎక్కువ రోజులు కొనసాగదని తెలిసిందట. దీంతో ఇక శ్రీ లీలకు పెళ్లి చేయకూడదని తల్లి నిర్ణయించుకుందట. అంతేకాకుండా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేయాలని, హద్దులు దాటకుండా, చెడ్డపేరు తెచ్చుకోకుండా తన కాళ్ల మీద తాను బతకాలని తెలిపిందట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, విషయం మాత్రం వైరల్ అవుతోంది.
Read more : విడాకులే కాలేదు.. నిహారిక పై రెండో పెళ్లి రూమర్స్.. చేసుకోబోయేది ఆయాననేనట!?