ఆ మధురమైన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోను: బిగ్‌బి ప్రాంక్‌పై నటి

బాలీవుడ్ నటి అహానా కుమ్రా నటుడు అమితాబ్ బచ్చన్‌ 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన చేష్టలను గుర్తుచేసుకుంది.

Update: 2022-10-11 09:13 GMT
ఆ మధురమైన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోను: బిగ్‌బి ప్రాంక్‌పై  నటి
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ నటి అహానా కుమ్రా నటుడు అమితాబ్ బచ్చన్‌ 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన చేష్టలను గుర్తుచేసుకుంది. 2014లో 'యుధ్‌' సిరీస్‌లో బిగ్‌బితో కలిసి పనిచేసిన ఆమె.. ఆ మధురమైన జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేనని అంటోంది. 'యుధ్ షూటింగ్ చివరి రోజు అర్జెంట్‌గా పారిస్ వెళ్ళాల్సి ఉంది. దీంతో చివరి రోజు షూటింగ్ త్వరగా ఫినిష్ చేయాలనుకున్నా. కానీ, ఆ రోజే రెండు సార్లు షూటింగ్ రీషెడ్యూల్ చేశారు. దీంతో టికెట్ షెడ్యూల్ మార్చుకోవాల్సి వచ్చింది. ఆ మరుసటిరోజు కూడా బచ్చన్ ఎక్కడికో వెళ్ళాల్సి రావడంతో మళ్లీ పోస్ట్‌పోన్ చేశారు.

దీంతో నేను ఒక మూలన కూర్చొని ఏడవడం మొదలు పెట్టాను. అప్పుడు అక్కడకొచ్చిన మిస్టర్ బిగ్‌బి.. 'నీ వెనకాల సింహం ఉంది పరిగెత్తు' అనడంతో నేను పెద్ద కేకవేసి పరుగందుకున్నా. దీంతో సెట్‌లో అందరూ పగలబడి నవ్వుకున్నారు' అని వివరించింది. చివరగా అమితాబ్ ఫన్నీ‌గా ఉండటానికే ఎక్కువ ఇష్టపడాతాడన్న నటి.. తన కెరీర్ ప్రారంభ రోజుల గురించి తమతో మాట్లాడేవాడని, అందులో ఎన్నో స్ఫూర్తినిచ్చే విషయాల నుంచి ఎవరైనా, ఎప్పుడైనా ప్రేరణ పొందవచ్చని చెప్పింది.

Also Read:  ఆస్కార్‌ మూవీ 'చెల్లో షో' బాల నటుడు మృతి    

Tags:    

Similar News