OTT లో కంటతడి పెట్టించే రియల్ స్టోరీ .. ఈ ఆస్కార్ నామినీ డాక్యుమెంటరీ ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Update: 2024-03-11 08:08 GMT

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో వస్తూ అందరినీ అలరిస్తుండగా.. తాజాగా మరో అద్భుతమైన ఆస్కార్ నామినీ డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకి ఆ డాక్యుమెంటరీ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ ‘టు కిల్ ఎ టైగర్’. నిషా పహుజా డైరెక్ట్ చేసిన ఈ మూవీకి నిషా పహుజాతో పాటు డేవిడ్ ఓపెన్ హిమ్, కార్నిలియా ప్రిన్సిప్ లు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. జార్ఖండ్‌లోని రాంచీలో ఒక కుటుంబం ఉంటుంది. వారికి 13 ఏళ్ల కూతురు ఉండగా.. పల్లెటూరిలో వీరు జీవనం సాగిస్తారు. ఆటలు, చదువు తప్ప మరో ధ్యాస లేని ఈ చిన్నారి ఒకరోజు క్రూరమైన అత్యాచారానికి గురవుతుంది. అయితే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాప కోసం న్యాయపోరాటం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆ మానవ మృగాలకు ఎలాగైనా శిక్ష పడేలా చేయాలని చాలా కష్టపడ్డారు. దీని ఆధారంగా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇక హృదయాన్ని కదిలించే ఈ స్టోరీని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి. కాగా ఈ డాక్యుమెంటరీ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా.. స్ట్రీమింగ్ అవుతుంది.


Similar News