తమిళ నడిఘర్ సంఘం సంచలన నిర్ణయం

తమిళ సినిమా పరిశ్రమలో మహిళా నటీమణులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది తమిళ నడిగర్ (తమిళ నటీనటుల) సంఘం.

Update: 2024-09-05 13:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమిళ సినిమా పరిశ్రమలో మహిళా నటీమణులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది తమిళ నడిగర్ (తమిళ నటీనటుల) సంఘం. ఈ మేరకు తమిళ నడిగర్ సంఘం అధ్యక్షులు నాజర్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళా నటీమణులు, సిబ్బందికి పని ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బందులు లేని వాతావరణాన్ని కల్పించేందుకు కొన్ని మార్గదర్శకాలు అవసరం అన్నారు. వాటన్నిటి మీద నడిగర్ సంఘానికి క్షుణ్ణమైన అవగాహన కోసం 'జస్టిస్ హేమ కమిటీ' తరహా కమిటీని వేస్తున్నామని ప్రకటించారు. అంతవరకు నటీమణులు, సిబ్బంది మీడియా ముందు కాకుండా నడిగర్ సంఘం ఇప్పటికే వేసిన అంతర్గత సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు నిజమని తేలితే వారిపై ఐదేళ్ల నిషేధం విధిస్తామని తెలిపింది. కమిటీ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని.. కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం పూర్తి విధి విధానాలను రూపొందిస్తామని తెలిపారు. కాగా దీనిపై తమిళ చిత్ర పరిశ్రమలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గురువారం కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిసి కన్నడ చిత్ర పరిశ్రమలోనూ.. ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు నటీమణులు, సామాజిక కార్యకర్తలు వినతి పత్రం అందించారు. దీనిపై సిద్దరామయ్య సానుకూలంగా స్పందించారు.


Similar News