నిజ జీవితంలో జరిగిన స్టోరీ.. ఇన్నాళ్లకు ఓటీటీలో స్ట్రీమింగ్
మహిళ సాధికరత అనే అంశాన్ని తీసుకుని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన స్టోరినే ‘సాచి’.
దిశ, సినిమా: మహిళ సాధికరత అనే అంశాన్ని తీసుకుని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన స్టోరినే ‘సాచి’. వివేక్ పోతగోని దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 మార్చి 3న థియేటర్లలో విడుదలైంది. కానీ ఇది చిన్న మూవీ కావడంతో ఎప్పుడు రిలీజైందో, ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా అంతగా ఎవరికీ తెలియదు. ఈ సినిమాలో పెద్దగా పేరున్న నటులు కూడా ఎవరు లేరు.
ఆడ, మగ అని తేడా లేకుండా మన కాళ్ల మీద మనం నిలబడాలనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. బార్బర్ నడిపే తండ్రి.. ఈయనకు ముగ్గురు కూతుర్లు. అంతా బాగానే ఉందనుకునే సమయానికి తండ్రి బ్రెయిన్ ట్యూమర్ జబ్బు వస్తుంది. దీంతో కూతురే ( సాచి) బార్బర్ నడుపుతూ, కుటుంబాన్ని పోషిస్తుంది. తండ్రికి సేవలు చేస్తుంది. అనుకోని సందర్భంలో సాచి తండ్రిని కోల్పోతుంది. అలాగే ఈ మూవీలో ఒక పిరికి అమ్మాయి మల్లిక.. భానవాత్ అనే యువకుడి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి? చివరికి సాచి ఏం చేసింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే ‘సాచి’ చిత్రం చూడాల్సిందే. కాగా ఈ మూవీ జనవరి 28 న ఓటీటీలో విడుదలవ్వనుందని సమాచారం.