Mega Family: గిన్నిస్ బుక్ రికార్డ్‌లో చిరుకు స్థానం.. మెగా ఫ్యామిలీ వరుస పోస్టులు.. నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తాజాగా మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు.

Update: 2024-09-22 16:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా చిరుకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ కూడా మెగాస్టార్‌కు ఆనందంలో విషెష్ తెలుపుతున్నారు. నెట్టింట వరుస పోస్టులు పెడుతూ.. చిరంజీవిని కొనియాడుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికన ఇలా రాసుకొచ్చారు. ‘నేను డిగ్రీ చదివేప్పుడు నా దగ్గర గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక పుస్తకం ఉండేది. అందులో సినిమా సంబంధిత రికార్డ్స్ నేను ఎక్కువగా చూడలేదు.

ఏవైన అద్భుతమైన సెట్స్ వేసినప్పుడో, బాండ్ చిత్రాల వంటి వాటిల్లో బోట్ తో లాంగ్ జంప్స్ చేసినప్పుడో ఇలా కొన్ని రికార్డ్స్ గురించి చదివాను. అవి కూడా చాలా తక్కువలో తక్కవ. నాకు తెలిసి ఒక 5% మాత్రమే సినీ సంబంధిత రికార్డ్స్ ఉండొచ్చు. కానీ అన్నయ్యకు 143 చిత్రాలలో 537 పాటల్లో 24 వేల డాన్స్ మూమెంట్స్ చేసినందుకు గాను ఇలాంటి అరుదైన రికార్డ్ గిన్నిస్ బుక్ లో నమోదు చేస్తూ పురస్కరించినందుకు చాలా గర్వంగా.. సంతోషంగా అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ అన్నయ్య’ అంటూ నాగబాబు తన సంతోషాన్ని పంచుకున్నారు. అలాగే ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన, రామ్ చరణ్, వరుణ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ నెట్టింట పోస్టులు పెట్టి.. చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read:

Megastar Chiranjeevi: చిరుకు విశిష్ట గౌరవం.. సంతోషంలో సక్సెస్ వెనక కారణాలు వెల్లడించిన మెగాస్టార్  


Similar News