S. S. Rajamouli : డైరెక్టర్ రాజమౌళికి కీలక పదవి

ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్( ఐఎస్‌బీసీ ) నూతన చైర్మన్‌గా టాలివుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని నియమితులయ్యారు.

Update: 2023-07-01 10:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్( ఐఎస్‌బీసీ ) నూతన చైర్మన్‌గా టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని నియమితులయ్యారు. త్వరలోనే ఐఎస్బీసీ చైర్మన్‌గా రాజమౌళి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఐఎస్‌బీసీ జాయింట్ సెక్రెటరీగా రాజమౌళి కుమారుడు కార్తికేయ ఉండగా.. సంస్థకు చీఫ్ ప్యాట్రన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ఉన్నారు. వెటరన్ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ ప్రధాన సలహాదారుగా ఉన్నారు.

ఇండియాలో స్కూల్ స్థాయి నుంచే తమ టాలెంట్ నిరూపించేందుకు ఓ వేదికను అందించడంతో పాటు, గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించేందుకు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ మార్గనిర్దేశంలో ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్‌బీసీ) ఏర్పడింది. ‘నేను కూడా క్రికెట్ ఆడుతాను, నాకు క్రికెట్ అంటే ఇష్టం.. స్కూల్ టైంలో మా ఊర్లో నేను క్రికెట్ ఆడేవాడ్ని, గ్రామాల్లో చాలా టాలెంట్ ఉంటుంది కానీ, సరైన ప్లాట్ ఫామ్ ఉండదు’ అని రాజమౌళి అన్నారు. ఐఎస్‌బీసీ తనను కలిసి రూరల్ క్రికెట్ కోసం పని చేస్తున్నాం.. అనగానే ఓకే చెప్పానని తెలిపారు. ఐఎస్‌బీసీ దేశ వ్యాప్తంగా విస్తరించిందని, రూరల్ ప్లేయర్స్ కోసం పని చేస్తానని ఈ సందర్భంగా రాజమౌళి మీడియాకు తెలిపారు. 

Read More:   నిహారికతో ఎడబాటు..? ఆ బాధను తట్టుకోలేక మెడిటేషన్‌ సెంటర్‌లో చేరిన మెగా అల్లుడు.. పోస్ట్ వైరల్

సింగర్ చిన్మయిపై ట్రోల్స్.. ఆమెను అర్థం చేసుకోండి అంటూ రాహుల్ ఎమోషనల్ నోట్

Tags:    

Similar News