Sri Reddy: చంద్రబాబు, పవన్ ఎఫెక్ట్.. నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

వివాదస్పద నటి శ్రీ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా

Update: 2024-07-20 13:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: వివాదస్పద నటి శ్రీ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు బిగ్ షాకిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి అనుచిత వ్యాఖలు చేశారని టీడీపీ నేత రాజు యాదవ్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజు యాదవ్ కంప్లైంట్ మేరకు శ్రీరెడ్డిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలంటూ త్వరలోనే ఆమెకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా, కాంట్రావర్శియల్ యాక్టర్‌గా ముద్రపడిన శ్రీరెడ్డి వైఎస్ జగన్‌కు మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీలపై విరుచుకుపడుతారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, ఇతర టీడీపీ నేతల పేరు చెబుతేనే ఆమె ఒంటి కాలిపై లేస్తారు. అసభ్య పదజాలంతో పవన్ కల్యాణ్, చంద్రబాబులపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తారు.

వాళ్ల వయస్సు, రాజకీయ అనుభవానికి కూడా గౌరవం ఇవ్వకుండా రాయలేని అసభ్య పదాలు వాడుతూ తిడుతుంటారు. మరీ ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీరెడ్డి మరింత రెచ్చిపోయారు. వైసీపీకి సపోర్ట్ చేస్తూ.. టీడీపీ, జనసేన పార్టీలపై ధ్వజమెత్తారు. అయితే, మొన్నటి వరకు ఏపీలో జగన్ ప్రభుత్వం ఉండటంతో శ్రీరెడ్డి ఆటలు నడవగా.. ఇటీవల చంద్రబాబు నేృత్వతంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శ్రీరెడ్డి చర్యలు మొదలయ్యాయి. మరోవైపు తనపై నమోదు అయిన కేసుపై శ్రీరెడ్డి స్పందించారు. ‘కడప, హైదరాబాద్, కర్నూల్‌లో నా మీద కేసులంట.. ఎంజాయ్ టీడీపీ బ్యాచెస్’ అంటూ తనదైన శైలీలో ఫేస్ బుక్ వేదికగా శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు.


Similar News