NTR: 30 రోజులు నిద్రలేని రాత్రులు.. ‘దేవర’ మూవీపై అంచనాలు పెంచేసిన సినిమాటోగ్రాఫర్ (పోస్ట్)

ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2024-09-21 12:30 GMT

దిశ, సినిమా: ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ‘దేవర’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన దేవర నుంచి పలు అప్డేట్స్ విడుదలై ఊహించని విధంగా భారీ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 27న విడుదల కాబోతుండటంతో అంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ మాత్రం దేవర మానియా మొదలెట్టి పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, దేవర సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన రత్నవేలు ఆసక్తికర పోస్ట్‌తో అంచనాలను రెట్టింపు చేశారు. ‘‘దేవర కలర్ గ్రేడింగ్ మ్యాచింగ్ భారీ వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాము. ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్, డీ బాక్స్, 4 డీఎక్స్, ఓవర్సీస్ 2.35 ఎమ్ఎమ్ కంపెనీలు కంటెంట్ ను సరైన సమయానికి అందించాయి. మా దేవరను థియేటర్లలో చూసి ఆనందించండి’’ అని తెలిపారు. అలాగే వీఎఫ్‌ఎక్స్ ఫొటోతో పాటు ఎన్టీఆర్‌తో దిగిన పిక్ షేర్ చేశారు.

 

Tags:    

Similar News