దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సౌత్ ఇండియన్ ఫీవర్ నడుస్తోందనే చెప్పుకోవాలి. సౌత్ ఇండియాలో పెరిగిపోతున్న పాన్ ఇండియా సినిమాలు, హీరోల దెబ్బకి నార్స్ సినీ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. ఉత్తరాది ప్రేక్షకులు కూడా దక్షిణాది సినిమాలకు ఫిదా అవుతున్నారు. దీంతో బాలీవుడ్ పలు సౌత్ సినిమాలను హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే బాలీవుడ్ రీమేక్ చేస్తున్న సౌత్ సినిమాల సంఖ్య అందరినీ ఔరా అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు. దాదాపు 25 సౌత్ సినిమాలను బాలీవుడ్ రీమేక్‌కు రెడీ చేస్తోంది. వాటిలో ఎక్కువ తమిళం, తెలుగు సినిమాలే ఉన్నాయి.
అలా వైకుంఠపురములో, జెర్సీ, హిట్, నాంది, ఛత్రపతి సినిమాలు తెలుగువి కాగా.. కైతి, జిగర్తాండ, అన్నియన్, విక్రమ్ వేద, ధ్రువంగళ్ పతినారు, రాత్ససన్, తాడం, కోమలి, మానగరం, అరువి, మానాడు, సూరరై పొట్రు, మాస్టర్‌లు తమిళ సినిమాలు. వీటితో పాటుగా మళయాలంలో డ్రైవింగ్ లైసెన్స్, దృశ్యం 2, హెలెన్, అయ్యప్పనుమ్ కోషియుం, నయట్టు రీమేక్ కానున్నాయి. ఇక కన్నడ సినిమాల్లో యూటర్న్ సినిమా ఒక్కటే బాలీవుడ్ రీమేక్ అవుతోంది. వీటన్నింటితో పాటుగా మరిన్ని సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యేందుకు చర్చల్లో ఉన్నాయి. అవి కూడా ఓకే అయితే ఈ ఏడాది కానీ వచ్చే ఏడాది కానీ దేశవ్యాప్తంగా సౌత్ సినిమాల జాతర జరగడం ఖాయమని సినీ ప్రేమికులు అంటున్నారు.