సినిమా థియేటర్స్ వెంటనే తెరిపించాలి
దిశ, ముషీరాబాద్: లాక్డౌన్ కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లను వెంటనే తెరిపించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సుదర్శన్, దేవీ థియేటర్లలో పనిచేసే కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎం.మారన్న, థియేటర్ మేనేజర్ ఆర్.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె.వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమా […]
దిశ, ముషీరాబాద్:
లాక్డౌన్ కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లను వెంటనే తెరిపించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలో భాగంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సుదర్శన్, దేవీ థియేటర్లలో పనిచేసే కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా థియేటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎం.మారన్న, థియేటర్ మేనేజర్ ఆర్.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జె.వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమా థియేటర్లను తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సినిమా థియేటర్లలో పనిచేసే కార్మికులను ఆదుకోవడంలో సినీ రంగ ప్రముఖులు విఫలమయ్యారని విమర్శించారు. కార్మికులు జీతాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. ఈ విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే జోక్యం చేసుకుని.. థియేటర్స్ తెరిపించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.