బైక్ వదిలి Motorist పరార్.. తనిఖీల్లో పోలీసులకు ఊహించని షాక్
దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై పోలీసులు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలువురు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. సాధారణంగా పోలీసులు తనిఖీలు చేస్తుంటే.. రూల్స్ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు బైక్ యూటర్న్ చేసుకుని అడ్డదారిలోనూ పరారీ అవుతుంటారు. కానీ, హైదరాబాద్ అంబర్‌పేట్‌లో పోలీసులు మాత్రం ఓ సీన్ చూసి షాక్ అయ్యారు. అంబర్‌పేట్-రామంతాపూర్ రూట్‌లో అలీ కేఫ్ వద్ద నిత్యం కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే AP […]
దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై పోలీసులు జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలువురు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. సాధారణంగా పోలీసులు తనిఖీలు చేస్తుంటే.. రూల్స్ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారు బైక్ యూటర్న్ చేసుకుని అడ్డదారిలోనూ పరారీ అవుతుంటారు. కానీ, హైదరాబాద్ అంబర్‌పేట్‌లో పోలీసులు మాత్రం ఓ సీన్ చూసి షాక్ అయ్యారు. అంబర్‌పేట్-రామంతాపూర్ రూట్‌లో అలీ కేఫ్ వద్ద నిత్యం కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే AP 23 M 9895 హీరో హోండా ప్యాషన్ బైక్ మీదుగా వచ్చిన వ్యక్తి పోలీసులను చూసి ఏకంగా బైక్ వదిలి పరారీ అయ్యాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే వెళ్లి బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎందుకీ వ్యక్తి బైక్ వదిలి ఉంటాడని ఒక్కసారి ఈ చలాన్ రిపోర్టు చూసి.. ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ బైక్‌పై 179 చలాన్లు ఉండడంతో ఆశ్చర్యపోయారు. 42 వేల 472 రూపాయల పెండింగ్ చలాన్లు కట్టలేకనే బైక్ వదిలి పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.