కొడుక్కి దెయ్యం పట్టిందని.. తల్లి చేసిన పనిచూస్తే షాక్
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. కన్నకొడుకునే కన్నతల్లి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కొడుకుకు దెయ్యం పట్టిందని ఇద్దరు మహిళలతో కలసి తల్లి కొడుకును అతి దారుణం కొట్టి చంపిన ఘటన తిరువన్నామలై జిల్లా అరణిలో చోటు చేసుకుంది. కొడుకు ప్రవర్తన బాగాలేదు దెయ్యం పట్టిందని పూజలు చేస్తుంటే మరణించాడని తల్లితో పాటు ఇద్దరు మహిళలు పోలీసులకు తెలిపారు. కానీ తల్లి సబర్యమ్మ మానసిక పరిస్థితి బాగా లేదని […]
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. కన్నకొడుకునే కన్నతల్లి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కొడుకుకు దెయ్యం పట్టిందని ఇద్దరు మహిళలతో కలసి తల్లి కొడుకును అతి దారుణం కొట్టి చంపిన ఘటన తిరువన్నామలై జిల్లా అరణిలో చోటు చేసుకుంది. కొడుకు ప్రవర్తన బాగాలేదు దెయ్యం పట్టిందని పూజలు చేస్తుంటే మరణించాడని తల్లితో పాటు ఇద్దరు మహిళలు పోలీసులకు తెలిపారు. కానీ తల్లి సబర్యమ్మ మానసిక పరిస్థితి బాగా లేదని అందుకే కొడుకుపై ఇలా ప్రవర్తిచిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.