హోం ఐసోలేషన్లో తల్లీకూతురు మృతి
దిశ, ముధోల్: కొవిడ్ తో తల్లి, కూతురు ఓకె గదిలో మృతి చెందిన ఘటన ముధోల్ మండలం రాంటెక్ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి లక్ష్మి బాయి(70), కూతురు భారతిబాయి(50) ఇద్దరికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వీరు గత నాలుగు రోజుల నుంచి హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. మృతదేహాల వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐసోలేషన్ లో ఉన్నప్పుడే వారిద్దరు […]
దిశ, ముధోల్: కొవిడ్ తో తల్లి, కూతురు ఓకె గదిలో మృతి చెందిన ఘటన ముధోల్ మండలం రాంటెక్ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి లక్ష్మి బాయి(70), కూతురు భారతిబాయి(50) ఇద్దరికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వీరు గత నాలుగు రోజుల నుంచి హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. మృతదేహాల వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఐసోలేషన్ లో ఉన్నప్పుడే వారిద్దరు మరణించారని, బాడీ మొత్తం కుల్లిపోవడంతో గత 3 రోజుల క్రితంమే వీరు చనిపోయారని గ్రామస్తులు భావిస్తున్నారు.
మృతదేహాలను తొలగించడానికి ఎవరు ముందుకు రాక పోవడంతో శవాలను తొలగించడానికి వచ్చిన సహారా యూత్ సభ్యులు, బాడీమొత్తం కుల్లిపోయిందని ఆ ఏరియా లో నిలబడే పరిస్థితి కూడా లేదని తెలిపారు. తొందరగా అధికార యంత్రాంగం ఈ మృతదేహాలను తొలగించాలని గ్రామాస్థులు, అక్కడి వచ్చిన సహారా యూత్ సభ్యులు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.