23ఏళ్ల యువతికి మిస్డ్‌కాల్.. అంతలోనే !
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్‌లో వేధిస్తున్న యువకుడిని.. తల్లీకూతురు కలిసి చంపేసిన ఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోయబత్తూరులోని కరామడైలో 23ఏళ్ల యువతి శ్రేయ, ఆమె తల్లి సుజాత నివాసం ఉంటున్నారు. ఇదేక్రమంలో ఒకరోజు శ్రేయకు మిస్డ్ కాల్ రాగా ఆమె తిరిగి ఫోన్ చేయడంతో ఓ యువకుడు అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేసినా వినకుండా ప్రతిరోజు అసభ్యంగా మాట్లాడుతుండటంతో టార్చర్ భరించలేక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమెతో కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్‌లో వేధిస్తున్న యువకుడిని.. తల్లీకూతురు కలిసి చంపేసిన ఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోయబత్తూరులోని కరామడైలో 23ఏళ్ల యువతి శ్రేయ, ఆమె తల్లి సుజాత నివాసం ఉంటున్నారు. ఇదేక్రమంలో ఒకరోజు శ్రేయకు మిస్డ్ కాల్ రాగా ఆమె తిరిగి ఫోన్ చేయడంతో ఓ యువకుడు అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆమె ఫోన్ కట్ చేసినా వినకుండా ప్రతిరోజు అసభ్యంగా మాట్లాడుతుండటంతో టార్చర్ భరించలేక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమెతో కూడా యువకుడు బూతులే మాట్లాడటంతో విసిగిపోయి పక్కా స్కెచ్ గీశారు.
ఈనెల 20న యువకుడికి ఫోన్ చేసి సౌమ్యంగా మాట్లాడిన తల్లీకూతురు ఇంటికి పిలిచారు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో యువకుడు అక్కడికి చేరుకోగానే.. ఎందుకు ఫోన్ చేసి వేధిస్తున్నావని నిలదీయడంతో వాగ్వాదం జరిగింది. ఇదేక్రమంలో తీవ్ర కోపానికి గురైన తల్లీకూతురు యువకుడిపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో అక్కికక్కడే చనిపోయాడు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన యువకుడు కోయంబత్తూరులోని అరుల్‌నగర్ వాసి పెరియసామిగా గుర్తించారు.