మోస్ట్ వాంటెడ్ కోతి…పట్టిస్తే రూ. 50వేలు…
దిశ వెబ్ డెస్క్: అది మాములు కోతి కాదు. మోస్ట్ వాంటెడ్ కోతి. దాన్నిపట్టించిన వారికి రూ.50వేల బహుమతి ఇవ్వనున్నారు. అదేంది కోతి మోస్ట్ వాంటేడ్ ఎందుకైంది. అసలు కోతిని పట్టిస్తే అంత డబ్బు ఎందుకు బహుమతిగా ఇస్తారని అనుకుంటున్నారా..అయితే ఈ వార్త చదవండి చండీగఢ్‌కు చెందిన పచ్చబొట్టుల ఆర్టిస్ట్ కమల్ జీత్ సింగ్, ఆయన మేనేజర్ దీపక్ ఓహ్రాలు ఓ కోతిని పెంచుకుంటున్నారు. కాగా అటవీ జంతువులను అక్రమంగా పెంచుకుంటున్నారనే కారణంగా వీరిని పోలీసులు అరెస్టు […]
దిశ వెబ్ డెస్క్:
అది మాములు కోతి కాదు. మోస్ట్ వాంటెడ్ కోతి. దాన్నిపట్టించిన వారికి రూ.50వేల బహుమతి ఇవ్వనున్నారు. అదేంది కోతి మోస్ట్ వాంటేడ్ ఎందుకైంది. అసలు కోతిని పట్టిస్తే అంత డబ్బు ఎందుకు బహుమతిగా ఇస్తారని అనుకుంటున్నారా..అయితే ఈ వార్త చదవండి
చండీగఢ్‌కు చెందిన పచ్చబొట్టుల ఆర్టిస్ట్ కమల్ జీత్ సింగ్, ఆయన మేనేజర్ దీపక్ ఓహ్రాలు ఓ కోతిని పెంచుకుంటున్నారు. కాగా అటవీ జంతువులను అక్రమంగా పెంచుకుంటున్నారనే కారణంగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మరుసటి రోజే వారిద్దరికి బెయిల్ లభించడంతో బయటకు వచ్చారు. కాగా కోతిని పెంచుకోవడం నేరమనే విషయం తమకు తెలియదనీ, విషయం తెలిశాక కోతిని అడవిలో విడిచిపెట్టామని విచారణలో పోలీసులకు తెలిపారు . కాగా నిందితులు చెబుతున్న విషయాలు నమ్మశక్యంగా లేవనీ వారిపై పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పీఈటీఏ) అనే సంస్థ కోర్టులో కేసు వేసింది.
దీనిపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుల మాటలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. వారు చెప్పిన విషయాలను నిరూపించాలని వారిని కోర్టు ఆదేశించింది. ఇక కేసు నేపథ్యంలో అధికారులు కూడా కోతి కోసం వెతుకుతున్నారు .అయితే ఈ విషయాన్ని సదరు స్వచ్చంద సంస్థ సీరియస్ గా తీసుకుంది. కోతి ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నజరానాను ప్రకటించింది. ఇక కోతి కోసం నిందితులు, పోలీసులు, స్వచ్చంద సంస్థ వెతుకుతుండటంతో ఇప్పుడు అది మోస్ట్ వాంటెడ్ గా మారింది.