అభ్యర్థులు రావట్లేదు…

దిశ వెబ్ డెస్క్: జేఈఈ మెయిన్స్-2020కు అత్యధికులు గైర్హాజరు అవుతున్నారు. కరోనా కాలంలో పరీక్షలు వాయిదాకు కేంద్రం నో చెప్పడంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. సెప్టెంబర్1న ఈ పరీక్షలు ప్రారంభం కాగా..ఇప్పటి వరకు లక్షకు మంది పైగా హాజరు కాలేదంటేనే పరిస్థితి అర్థం అవుతోంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం…జేఈఈ మెయిన్స్ పరీక్షలకు 4,58,521 అభ్యర్థులు అర్హత సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ పరీక్షలకు ఇప్పటి వరకు 1,14,563 మంది పరీక్షకు హాజరు […]

Update: 2020-09-04 05:34 GMT

దిశ వెబ్ డెస్క్: జేఈఈ మెయిన్స్-2020కు అత్యధికులు గైర్హాజరు అవుతున్నారు. కరోనా కాలంలో పరీక్షలు వాయిదాకు కేంద్రం నో చెప్పడంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షలకు దూరంగా ఉంటున్నారు. సెప్టెంబర్1న ఈ పరీక్షలు ప్రారంభం కాగా..ఇప్పటి వరకు లక్షకు మంది పైగా హాజరు కాలేదంటేనే పరిస్థితి అర్థం అవుతోంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం…జేఈఈ మెయిన్స్ పరీక్షలకు 4,58,521 అభ్యర్థులు అర్హత సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ పరీక్షలకు ఇప్పటి వరకు 1,14,563 మంది పరీక్షకు హాజరు కాలేదు. మొదటి రోజు పరీక్షకు హాజరైన విద్యార్థుల శాతం 54.67 శాతంగా ఉంది. రెండు, మూడు రోజుల్లో ఇది 81,82 శాతంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News