రాజస్థాన్ అసెంబ్లీని నడపనున్న చిన్నారులు!

దిశ, ఫీచర్స్ : బాలల దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పిల్లలు అక్కడ సభ అంతర్గత పనితీరును చూడవచ్చు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వారు స్వయంగా వీక్షించవచ్చు. ఇందుకోసం దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేశారు. నవంబర్ 14న రాజస్థాన్ అసెంబ్లీలోనికి 200 మంది చిన్నారులను అనుమతించడమే కాక వారితో సభ నిర్వహించే అవకాశం లభిస్తుందట. ఇందులో భాగంగా పిల్లలు ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, […]

Update: 2021-11-11 06:06 GMT

దిశ, ఫీచర్స్ : బాలల దినోత్సవం సందర్భంగా రాజస్థాన్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో పిల్లలు అక్కడ సభ అంతర్గత పనితీరును చూడవచ్చు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో వారు స్వయంగా వీక్షించవచ్చు. ఇందుకోసం దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేశారు.

నవంబర్ 14న రాజస్థాన్ అసెంబ్లీలోనికి 200 మంది చిన్నారులను అనుమతించడమే కాక వారితో సభ నిర్వహించే అవకాశం లభిస్తుందట. ఇందులో భాగంగా పిల్లలు ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకులు సహా చీఫ్ విప్, డిప్యూటీ చీఫ్ విప్ వంటి వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్‌లో పిల్లలు వివిధ సమస్యలు, సందేహాలను లేవనెత్తనున్నారు. ఇలా పిల్లలతో సెషన్‌ను నిర్వహించే తొలి రాష్ట్రంగా రాజస్థాన్ అసెంబ్లీ నిలవనుంది. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా కూడా పార్టిసిపేట్ చేయనున్నారు.

ఇక ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్ అసెంబ్లీ అధికారిక యూట్యూబ్ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ రాజస్థాన్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ‘రాబోయే తరాలకు సభను నిర్వహిస్తూ ప్రశ్నలు సంధించేందుకు, తమ అభిప్రాయాలను తెలిపేందుకు అవకాశం కల్పిస్తున్నాం. ఈ సెషన్ కోసం విద్యార్థులు కుర్తా, పైజామాలో కనిపించనున్నారు’ అని సీపీ జోషి తెలిపారు.

Tags:    

Similar News