ఖైరతాబాద్ గణేషుడి వద్ద భారీగా భక్తులు

దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో గణేషుడిని దర్శించుకునేందుకు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపినా కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరివస్తుండడంతో భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శానిటైజర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. మాస్క్ లేని భక్తులను గణేషుడిని దర్శంచుకునేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు. కాగా, మరోపక్క నిర్వాహకులు ఏర్పాటు చేసిన వెబ్ […]

Update: 2020-08-22 02:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో గణేషుడిని దర్శించుకునేందుకు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపినా కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరివస్తుండడంతో భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. శానిటైజర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. మాస్క్ లేని భక్తులను గణేషుడిని దర్శంచుకునేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు.

కాగా, మరోపక్క నిర్వాహకులు ఏర్పాటు చేసిన వెబ్ సైట్ ద్వారా కూడా భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ సంఖ్యలో పేర్లు నమోదు చేసుకుని పూజా కార్యక్రమాలు చేస్తున్నారు.

Tags:    

Similar News