గోదారిలో దూకిన కోతులు.. కన్నీరు పెట్టిన నెటిజన్లు.. వీడియో
దిశ, నిర్మల్ రూరల్ : గత్యంతరం లేక గోదావరి నదిలో దూకి కోతులు ఆత్మహత్య చేసుకున్నాయి. ఈ ఘటన బుధవారం మామడ మండలంలోని కమల్ కోట్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గోదావరి నదిపై నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాను కలుపుతూ బ్రిడ్జి నిర్మించారు. అయితే నిజామాబాద్ జిల్లాలోని గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన రైతులు పంట పొల్లాలో కోతులు పడి.. పంట నష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నదిపై నిర్మించిన వంతెన ద్వారా […]
దిశ, నిర్మల్ రూరల్ : గత్యంతరం లేక గోదావరి నదిలో దూకి కోతులు ఆత్మహత్య చేసుకున్నాయి. ఈ ఘటన బుధవారం మామడ మండలంలోని కమల్ కోట్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గోదావరి నదిపై నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాను కలుపుతూ బ్రిడ్జి నిర్మించారు.
అయితే నిజామాబాద్ జిల్లాలోని గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన రైతులు పంట పొల్లాలో కోతులు పడి.. పంట నష్టం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి నదిపై నిర్మించిన వంతెన ద్వారా నిర్మల్ జిల్లా కమల్ కోట్ చెక్ పోస్ట్ వైపు కోతులను రైతులు తరిమారు. అదే సమయంలో బ్రిడ్జీ అవతలి వైపు నుంచి కూడా రైతులు కోతులను అడ్డుకోవడంతో అవి బ్రిడ్జి మధ్యలో చిక్కుకుపోయాయి.
ఈ క్రమంలో గత్యంతరం లేక.. గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాయి. దీంతో వరదల్లో కొట్టుకుపోవడంతో ఈ ఘటన చూసిన ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. కోతులు వాపస్ పోవాలే అని కేసీఆర్ హరితహారంలో భాగంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం నిర్మల్ జిల్లాలో కోతుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి.. ఆ ప్రాంత పరిసరాల్లో ఉన్న కోతులను అక్కడ సంరక్షిస్తుండటం గమనార్హం.