‘పోస్టాఫీసుల్లోనూ నగదు విత్ డ్రా చేసుకోండి’
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు ప్రభుత్వం జమ చేసిన రూ.1500లను పోస్టాఫీసుల్లోనూ తీసుకోవచ్చని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ ద్వారా నగదు తీసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. అలాగే, ఇప్పటివరకు నగదు జమకాని వారికి సైతం నగదు చెల్లించేలా చర్యలు తీసుకుందన్నారు. లబ్దిదారులు తమ ఆధార్ కార్డుతో దగ్గర్లోని పోస్టాఫీస్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా నగదు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోస్టాఫీసుల్లో నగదు పంపిణీ చేసే సిబ్బందికి అవసరమైన మాస్కులు, […]
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు ప్రభుత్వం జమ చేసిన రూ.1500లను పోస్టాఫీసుల్లోనూ తీసుకోవచ్చని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ ద్వారా నగదు తీసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. అలాగే, ఇప్పటివరకు నగదు జమకాని వారికి సైతం నగదు చెల్లించేలా చర్యలు తీసుకుందన్నారు. లబ్దిదారులు తమ ఆధార్ కార్డుతో దగ్గర్లోని పోస్టాఫీస్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా నగదు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోస్టాఫీసుల్లో నగదు పంపిణీ చేసే సిబ్బందికి అవసరమైన మాస్కులు, శానిటైజర్‌లను కలెక్టర్ అందజేశారు.
Tags: money, withdraw, medak, collector