మోడీ పేరుతో మోసం.. 35వేలు నొక్కేసిన కేటుగాళ్లు..
దిశ, కూకట్‌పల్లి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహాయ నిధి నుంచి ఫోన్చేస్తున్నామని నమ్మించిన సైబర్‌నేరగాళ్లు ఓ యువతి నుంచి 35 వేల రూపాయలు దోచుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి సర్కిల్ భాగ్యనగర్ కాలనీకి చెందిన బానావత్ వినీషా(22), హైటెక్‌సిటీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. 29న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 9650824344 నంబర్ నుంచి వినీషాకు ఫోన్ కాల్ వచ్చింది. అవతల మాట్లాడుతున్న వ్యక్తి తను ప్రధాన […]
దిశ, కూకట్‌పల్లి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహాయ నిధి నుంచి ఫోన్చేస్తున్నామని నమ్మించిన సైబర్‌నేరగాళ్లు ఓ యువతి నుంచి 35 వేల రూపాయలు దోచుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్‌పల్లి సర్కిల్ భాగ్యనగర్ కాలనీకి చెందిన బానావత్ వినీషా(22), హైటెక్‌సిటీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుంది. 29న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 9650824344 నంబర్ నుంచి వినీషాకు ఫోన్ కాల్ వచ్చింది. అవతల మాట్లాడుతున్న వ్యక్తి తను ప్రధాన మంత్రి సహాయ నిధి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మీకు 32 వేల రూపాయలు అందిస్తున్నామని నమ్మించాడు.
యువతితో ఫోన్లో మాట్లాడుతూనే ఫోన్ పే కు డబ్బులు పంపుతున్నానని చెప్పాడు. దీంతో ఫోన్‌పే యాప్తెరిచి చూసిన వినీషాకు 30 వేల రూపాయలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. లింక్ ఓపెన్ చేసి అందులో పిన్‌నంబర్ ఎంటర్ చేయమని చెప్పాడు దీంతో వినీషా లింక్ ఓపెన్ చేసి పిన్‌నంబర్ ఎంటర్ చేసింది, మళ్లీ 5 వేల రూపాయలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆ లింక్‌ను సైతం వినీషా ఓపెన్ చేసి పిన్‌నంబర్ ఎంటర్ చేసింది. కాల్‌కట్ అయిన తరువాత ఫోన్‌పే యాప్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోగా అందులో ఉన్న 38 వేల రూపాయలలో 35 వేల రూపాయలు మాయమయ్యాయి. దీంతో తను మోసపోయానని తెలుసుకున్న వినీషా శుక్రవారం కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.