ప్రైవేట్ టీచర్లకిచ్చే డబ్బులు, బియ్యం సరిపోవు : విజయశాంతి

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సర్కార్ 30 మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత స్పందించడం దారుణమని బీజేపీ రాష్ట్ర నాయకురాలు విజయశాంతి అన్నారు. కేవలం రూ.2వేలు, 25కేజీల బియ్యం ఇస్తే వారేలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. కరోన ఉధృతి కారణంగా ఆరేడు నెలల నుంచి ప్రైవేట్ టీచర్లు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయి తోపుడు […]

Update: 2021-04-09 11:46 GMT

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సర్కార్ 30 మంది ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత స్పందించడం దారుణమని బీజేపీ రాష్ట్ర నాయకురాలు విజయశాంతి అన్నారు. కేవలం రూ.2వేలు, 25కేజీల బియ్యం ఇస్తే వారేలా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. కరోన ఉధృతి కారణంగా ఆరేడు నెలల నుంచి ప్రైవేట్ టీచర్లు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

రాష్ట్రంలో ఎంతో మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయి తోపుడు బండ్లు నడుపుకుంటు కూరలమ్ముకుంటూ కూలీలుగా బతుకులు వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి దీన పరిస్థితిపై మీడియాలో ఎప్పటి నుంచో కథనాలు వచ్చాయని, అయినా.. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించలేదన్నారు. దీంతో రాష్ట్రంలో పలువురు ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆసరా డబ్బులు వారికి సరిపోయే అవకాశం లేదని, వారు సమాజంలో గౌరవప్రదంగా బ్రతికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్నారు.

Tags:    

Similar News