మొన్న గల్లంతు.. నేడు శవమై
దిశ, సిద్దిపేట: గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన మొయినుద్దీన్ మూడు రోజుల క్రితం స్నానం చేయడానికి దాతర్‌పల్లి సమీపంలోని కాలువలోకి దిగాడు. స్నానం చేస్తూ కాలువలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలించిన ఆచూకీ లభించలేదు. గురువారం కోనాపూర్ పంప్ హౌస్ వద్ద అతని శవం తేలడంతో గజ ఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం తదితరులు బాధితుడి కుటంబాన్ని ఓదార్చి, ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం […]
దిశ, సిద్దిపేట: గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన మొయినుద్దీన్ మూడు రోజుల క్రితం స్నానం చేయడానికి దాతర్‌పల్లి సమీపంలోని కాలువలోకి దిగాడు. స్నానం చేస్తూ కాలువలో కొట్టుకుపోయాడు. అతని కోసం గాలించిన ఆచూకీ లభించలేదు. గురువారం కోనాపూర్ పంప్ హౌస్ వద్ద అతని శవం తేలడంతో గజ ఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు. హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి, గజ్వేల్ జడ్పీటీసీ పంగ మల్లేశం తదితరులు బాధితుడి కుటంబాన్ని ఓదార్చి, ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు.