'భక్త కన్నప్ప' రీమేక్‌పై 'బాహుబలి' నిరాశ

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… తెలుగు సినిమాపై అభిమానం ఉన్న వ్యక్తి. తన జీవితాన్ని నిలబెట్టిన కళామతల్లి రుణాన్ని తీర్చుకునేందుకు తపిస్తున్న నటుడు. ఈ క్రమంలోనే ఓ చారిత్రాత్మక తెలుగు చిత్రాన్ని రీమేక్ చేసేందుకు అంకురార్పణ చేశారాయన. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రెబర్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ సినిమాను మళ్లీ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రీమేక్‌లో మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు లీడ్ రోల్‌లో కనిపిస్తుండగా.. ఇతర నటీనటులపై త్వరలోనే […]

Update: 2020-02-22 07:26 GMT

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… తెలుగు సినిమాపై అభిమానం ఉన్న వ్యక్తి. తన జీవితాన్ని నిలబెట్టిన కళామతల్లి రుణాన్ని తీర్చుకునేందుకు తపిస్తున్న నటుడు. ఈ క్రమంలోనే ఓ చారిత్రాత్మక తెలుగు చిత్రాన్ని రీమేక్ చేసేందుకు అంకురార్పణ చేశారాయన. రూ.60 కోట్ల బడ్జెట్‌తో రెబర్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో వచ్చిన ‘భక్త కన్నప్ప’ సినిమాను మళ్లీ తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రీమేక్‌లో మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు లీడ్ రోల్‌లో కనిపిస్తుండగా.. ఇతర నటీనటులపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం విష్ణు ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కతున్న ‘మోసగాళ్లు’ సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నారు.

అయితే పెద్ద నాన్న కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’ సినిమాపై ఎప్పటి నుంచో ఆసక్తి కనబరుస్తున్నాడు ‘బాహుబలి’ యాక్టర్ ప్రభాస్. ‘భక్త కన్నప్ప’ను రీమేక్ చేయాలని కూడా భావించినా.. అది బ్రేక్ పడుతూనే వచ్చింది. చివరికి ఆ ప్రాజెక్ట్ కాస్తా మంచు ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో కాస్త నిరాశకు గురయ్యారట ప్రభాస్. పెద్దనాన్న క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’లో నటించే ఛాన్స్ కోల్పోయినందుకు ఫీల్ అవుతున్నాడట.

గోత్రం లోపలే పెళ్లి చేసుకున్నదని తల్లిదండ్రులే.. దారుణం

Full View

Tags:    

Similar News