EXAMS : రేపు మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్
దిశ, నిజామాబాద్ రూరల్ : మోడల్ స్కూల్ ప్రవేశాలు(2021-22)కు గాను శనివారం (రేపు) అర్హత పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాధికారి విజయభాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతి ప్రవేశాల కొరకు 1,755 మంది విద్యార్ధులు,7వ తరగతి నుండి 10వ తరగతి ప్రవేశ పరీక్షలకు 1,185 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు అర్హత పరీక్ష ఉంటుందని.. అదేవిధంగా 7వ తరగతి నుండి […]
దిశ, నిజామాబాద్ రూరల్ : మోడల్ స్కూల్ ప్రవేశాలు(2021-22)కు గాను శనివారం (రేపు) అర్హత పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాధికారి విజయభాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 6వ తరగతి ప్రవేశాల కొరకు 1,755 మంది విద్యార్ధులు,7వ తరగతి నుండి 10వ తరగతి ప్రవేశ పరీక్షలకు 1,185 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు.
6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు అర్హత పరీక్ష ఉంటుందని.. అదేవిధంగా 7వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్ధులకు మధ్యాహ్నం12 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాధికారి తెలిపారు. విద్యార్థులందరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యార్థులు మాస్కులు ధరించి, బ్లాక్ మరియు బ్లూ బాల్ పెన్నులు, పరీక్ష ప్యాడ్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. పరీక్షల సమయానికి అరగంట ముందే కేంద్రాలకు హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయని జిల్లా విద్యాధికారి స్పష్టం చేశారు.