ఆయన జోడు గుర్రాల సవారీ చేస్తున్నాడు…
దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో జోడు గుర్రాల మీద ప్రధాని మోడీ సవారీ చేస్తున్నారనీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. బీహార్‌లో ఎన్‌డీఏ కూటమి నుంచి లోక్ జనశక్తి పార్టీ బయటకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటాననీ ఓటర్లకు ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చెప్పుకుంటున్నాడనీ తెలిపారు. కేవలం సీఎం నితీశ్‌కుమార్ తీరు నచ్చకే తాను కూటమి నుంచి వైదొలిగాననీ, బీజేపీకి తనకు మధ్య ఎలాంటి […]
దిశ, వెబ్ డెస్క్:
బీహార్‌లో జోడు గుర్రాల మీద ప్రధాని మోడీ సవారీ చేస్తున్నారనీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. బీహార్‌లో ఎన్‌డీఏ కూటమి నుంచి లోక్ జనశక్తి పార్టీ బయటకు వచ్చిందన్నారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటాననీ ఓటర్లకు ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చెప్పుకుంటున్నాడనీ తెలిపారు. కేవలం సీఎం నితీశ్‌కుమార్ తీరు నచ్చకే తాను కూటమి నుంచి వైదొలిగాననీ, బీజేపీకి తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవని చిరాగ్ చెబుతున్నారనీ ఆయన అన్నారు. ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ పార్టీలు కూటమిగా బరిలో దిగుతున్నాయని అన్నారు. కానీ ఈ విషయంలో బీజేపీ నేతలు నోరు మెదపడం లేదన్నారు. ప్రస్తుతం బీహార్ లో రెండు గుర్రాలపై మోడీ సవారీ చేస్తున్నారనీ అన్నారు. ఎల్జేపీ, జేడీయూ పార్టీల్లో ఒక దాని మద్దతుతో బీహార్‌ను పాలించాలని మోడీ చూస్తున్నారని ఆయన ఆరోపించారు.