మార్కులే సర్వస్వం కాదు.. ప్రపంచాన్ని చూడాలి: మోడీ
న్యూఢిల్లీ : మార్కులే సర్వస్వం కాదని, వాటి పరిధిని దాటి ప్రపంచాన్ని చూడాలని విద్యార్థులకు ప్రధాని మోడీ సూచించారు. ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్‌లో భాగంగా ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. కొవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తేనే వారికి పరీక్షల భయం పోతుందని తెలిపారు. జీవితంలో ఎన్నో దశలుంటాయని, పరీక్షలు అందులో భాగమేనని చెప్పారు. మార్కుల ఆధారంగా విద్యార్థులను అంచనా వేయడం […]
న్యూఢిల్లీ : మార్కులే సర్వస్వం కాదని, వాటి పరిధిని దాటి ప్రపంచాన్ని చూడాలని విద్యార్థులకు ప్రధాని మోడీ సూచించారు. ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్‌లో భాగంగా ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. కొవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తేనే వారికి పరీక్షల భయం పోతుందని తెలిపారు. జీవితంలో ఎన్నో దశలుంటాయని, పరీక్షలు అందులో భాగమేనని చెప్పారు. మార్కుల ఆధారంగా విద్యార్థులను అంచనా వేయడం జరుగుతున్నదని అలా చేయడం దురదృష్టకరమని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి తెల్లవారుజామునే లేచి చదువుకోవాలని సూచించారు. ఆ సమయంలో ఏకాగ్రత సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పట్నుంచే కఠినమైన పనులతోనే తన దినచర్యను ప్రారంభించేవాడినని.. దీనినో అలవాటుగా మార్చుకున్నానని మోడీ తెలిపారు.