మోడ్రన్ వైకుంఠధామాలు
మనిషి జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు పుట్టుక, చావు. పుట్టిన వేడుకలు ఎవరి స్థాయిని బట్టి వారు చేసుకుంటారు. చావులో మాత్రం పేద, ధనిక తేడాలేకుండా చివరి యాత్ర సుఖమయంగా సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే మోడ్రన్ వైకుంఠధామాల నిర్మాణానికి పూనుకుంది. కూకట్‌పల్లి సర్కిల్‌పరిధిలో రూ.5కోట్లతో రెండు వైకుంఠధామాలను నిర్మిస్తోంది. ఓల్డ్‌బోయిన్‌పల్లి, ఎల్లమ్మబండ కాలనీల్లో వైకుంఠ ధామాలను సకల సౌకర్యాలతో చేపడుతోంది. ఉద్యానవనాన్ని తలపించేలా గార్డెన్, అంత్యక్రియలకు వచ్చిన వారి కోసం సిట్టింగ్గ్యాలరీ, […]
మనిషి జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు పుట్టుక, చావు. పుట్టిన వేడుకలు ఎవరి స్థాయిని బట్టి వారు చేసుకుంటారు. చావులో మాత్రం పేద, ధనిక తేడాలేకుండా చివరి యాత్ర సుఖమయంగా సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే మోడ్రన్ వైకుంఠధామాల నిర్మాణానికి పూనుకుంది. కూకట్‌పల్లి సర్కిల్‌పరిధిలో రూ.5కోట్లతో రెండు వైకుంఠధామాలను నిర్మిస్తోంది. ఓల్డ్‌బోయిన్‌పల్లి, ఎల్లమ్మబండ కాలనీల్లో వైకుంఠ ధామాలను సకల సౌకర్యాలతో చేపడుతోంది. ఉద్యానవనాన్ని తలపించేలా గార్డెన్, అంత్యక్రియలకు వచ్చిన వారి కోసం సిట్టింగ్గ్యాలరీ, స్నానపు గదులను నిర్మిస్తోంది. స్థానిక ఎమ్మెల్యేల చొరవతో పనులు చురుగ్గాకొనసాగుతున్నాయి.
దిశ, కూకట్‌పల్లి: ఉద్యాన వనాలను తలపిస్తున్నాయి వైకుంఠధామాలు.. ఆహ్లాదకరమైన పార్కుగా రూపుదిద్దుకుంటున్నాయి శ్మశాన వాటికలు. ఆధునిక హంగులతో వైకుంఠధామాలను నిర్మిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్, ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ కాలనీల్లో రెండు హిందూ శ్మశాన వాటికలను మహా ప్రస్థానంలో భాగంగా సర్కిల్ ఇంజినీరింగ్ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న హిందూ శ్మశాన వాటికను రూ.3కోట్ల వ్యయంతో, ఎల్లమ్మబండ కాలనీలో 1.2 ఎకరాల విస్తీర్ణంలో హిందూ శ్మశాన వాటికను రూ.2కోట్ల వ్యయంతో మోడ్రన్ శ్మశాన వాటికలుగా అభివృద్ధి చేస్తున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్ పల్లిలో శ్మశాన వాటిక అభివృద్ధికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీ శ్మశాన వాటిక అభివృద్ధికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు.
అన్ని వసతులతో ఏర్పాటు..
వెంకుంఠధామంలోకి అడుగు పెట్టగానే ప్రవేశ ద్వారంలో శివలింగంను ఏర్పాటు చేయనున్నారు. వైకుంఠధామంలో పూర్తిగా ఉద్యాన వనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మధ్యలో నాలుగు బర్నింగ్ ఫ్లాట్ ఫాంలతో కూడిన ఓ షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. దాని ముందు అంత్యక్రియలకు హాజరైన వారు కూర్చోవడానికి వీలుగా బర్నింగ్ ఫ్లాట్ ఫాంకు చుట్టూ సిట్టంగ్ గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత స్నానాలు చేసుకోవడానికి స్నానపు గదులను నిర్మిస్తున్నారు.
చురుగ్గా పనులు..
సర్కిల్ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్, ఓల్డ్ బోయిన్ పల్లి డివి జన్ల పరిధిలో రూ.5 కోట్ల వ్యయంతో వైకుంఠధామాల పనులు ప్రారంభించాం. పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఎం తో ఆహ్లాదకరంగా వైకుంఠధామాలను ఏర్పాటు చేసేం దుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – గోవర్ధన్ గౌడ్, డీఈ, కూకట్ పల్లి సర్కిల్