ఆధునిక టెక్నాలజీతో ‘మాక్ టెస్ట్’లు..

దిశ, తెలంగాణ బ్యూరో: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో టీ-శాట్ నెట్వర్క్ ఛానళ్లు పాఠ్యాంశాల ప్రసారాలు చేయనున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న ప్రత్యక్ష ప్రసారాలతో ప్రారంచనున్నారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో సుమారు […]

Update: 2021-01-24 11:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో టీ-శాట్ నెట్వర్క్ ఛానళ్లు పాఠ్యాంశాల ప్రసారాలు చేయనున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న ప్రత్యక్ష ప్రసారాలతో ప్రారంచనున్నారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో సుమారు 12,328 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన అంశాలను బోధించనున్నట్టు ఆయన తెలిపారు. అన్ని స్థాయిల ఉద్యోగాల పోటీ పరీక్షలకు తాము అందించే పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని సీఈఓ శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు.

పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ సందేహాలను ఫోన్ ద్వారా 040-23540326, 23540726, టోల్ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈఓ సూచించారు. జనరల్ ఇంగ్లీష్, ఇంటిలిజెన్స్, క్యాంటిటేటివ్ అప్టిట్యూట్, జనరల్ అవేర్ నెస్ అండ్ స్టాట్స్ కు సంబంధించిన ఐదు సబ్జెక్టుల్లో పాఠ్యాంశాలను సుమారు 75 రోజుల పాటు162 పాఠ్యాంశ భాగాలు 424 గంటలు ప్రసారాలు కొనసాగనున్నాయని సీఈఓ స్పష్టం చేశారు. టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్లు నిపుణ, విద్య ఛానెళ్లు 43 మంది కేబుల్ నెట్‌వర్క్ ఆపరేటర్లతో పాటు ఎయిర్ టెల్ 948-949, టాటా స్కై 1479-1480, సన్ డైరెక్ట్ 195-196 నెంబర్లలో ప్రసారాలను అందిస్తున్నాయని సీఈఓ తెలిపారు.

Tags:    

Similar News