11 అంకెల మొబైల్ నెంబర్.. ట్రాయ్ సిఫారసు
ఇప్పటి వరకు మొబైల్ నెంబర్ అంటే పది అంకెలే ఉండేవి. కానీ ఇక మీదట 11 అంకెలను కూడా ఉపయోగించుకోవచ్చని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫారసు చేసింది. అవసరమైనన్ని నెంబర్లను సృష్టించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వస్తోందని ట్రాయ్ పేర్కొంది. కాగా, 11 నెంబర్ల ఫార్మాట్లో మొదటి నెంబర్ 9గా తీసుకుంటే 10 బిలియన్ల కొత్త నెంబర్ల సామర్థ్యం పెరుగుతుందని, 70 శాతం ఉపయోగించిన తర్వాత కూడా 7 బిలియన్ల కనెక్షన్లు […]
ఇప్పటి వరకు మొబైల్ నెంబర్ అంటే పది అంకెలే ఉండేవి. కానీ ఇక మీదట 11 అంకెలను కూడా ఉపయోగించుకోవచ్చని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిఫారసు చేసింది. అవసరమైనన్ని నెంబర్లను సృష్టించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా చేయాల్సి వస్తోందని ట్రాయ్ పేర్కొంది. కాగా, 11 నెంబర్ల ఫార్మాట్లో మొదటి నెంబర్ 9గా తీసుకుంటే 10 బిలియన్ల కొత్త నెంబర్ల సామర్థ్యం పెరుగుతుందని, 70 శాతం ఉపయోగించిన తర్వాత కూడా 7 బిలియన్ల కనెక్షన్లు ఇచ్చుకోవచ్చని ట్రాయ్ తన సిఫార్సుల్లో తెలిపింది.
వీటితో పాటు ఫిక్స్డ్ లైన్ కనెక్షన్ నుంచి కాల్ చేసేటపుడు ఫోన్ నెంబర్‌కు ముందు సున్నా ఉపయోగించాలని, అయితే మొబైల్ ఫోన్ల నుంచి కాల్ చేసేటపుడు మాత్రం సున్నా అవసరం లేదని చెప్పింది. ఇందుకోసం ఫిక్స్డ్ కనెక్షన్‌కు మొదటి అంకెగా ఉపయోగించిన అంకెను మొబైల్ నెంబర్ల కోసం వినియోగించవద్దని పరిమితి విధించింది. అంతేకాకుండా డాంగిల్స్ కోసం ఉపయోగించే మొబైల్ నెంబర్ల అంకెల సంఖ్యను 10 నుంచి 13 వరకు మార్చాలని ట్రాయ్ సిఫార్సుల్లో సూచించింది.