మీ వద్దకే ఐసీఐసీఐ ATM సర్వీసులు
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో డబ్బుల కోసం ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టు తిరగకుండా ఉండేందుకు ప్రయివేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వినూత్న ఆలోచన చేసింది.తన కస్టమర్లకు సేవలందించేందుకు ఇంటివద్దకే మొబైల్ ఏటీఎం సర్వీసులను పంపిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, చెన్నై వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీఐసీఐ ప్రకటించింది. అయితే ఈ రకమైన సేవల పట్ల ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, […]
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో డబ్బుల కోసం ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల చుట్టు తిరగకుండా ఉండేందుకు ప్రయివేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వినూత్న ఆలోచన చేసింది.తన కస్టమర్లకు సేవలందించేందుకు ఇంటివద్దకే మొబైల్ ఏటీఎం సర్వీసులను పంపిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, చెన్నై వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలను ఎవరూ ఉల్లంఘించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐసీఐసీఐ ప్రకటించింది. అయితే ఈ రకమైన సేవల పట్ల ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, త్వరలోనే ఇతర నగరాలకు కూడా ఈ మొబైల్ ఏటీఎం సేవలను విస్తరిస్తామని బ్యాంకింగ్ దిగ్గజం తెలిపింది.
Tags: carona, lock down, mobile atm, icici, delhi, chennai