అక్కడ ప్రజల వద్దకే పైసలొస్తున్నయ్..

దిశ, నిజామాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఓ మంచి కార్యక్రమానికి పూనుకున్నారు. ఆ విధంగా అడుగులు ప్రారంభించారు. ఆ విధానంతో అక్కడి ప్రజలకు మేలు జరగడమే కాదు.. కరోనా మహమ్మారిని కట్టడి చేసే అవకాశముంది. వివరాలేమిటంటే.. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం వాహనాన్ని బుధవారం కలెక్టరేట్ లో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏటీఎం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అన్ని […]

Update: 2020-05-13 06:10 GMT

దిశ, నిజామాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఓ మంచి కార్యక్రమానికి పూనుకున్నారు. ఆ విధంగా అడుగులు ప్రారంభించారు. ఆ విధానంతో అక్కడి ప్రజలకు మేలు జరగడమే కాదు.. కరోనా మహమ్మారిని కట్టడి చేసే అవకాశముంది. వివరాలేమిటంటే.. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎం వాహనాన్ని బుధవారం కలెక్టరేట్ లో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏటీఎం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అన్ని బ్యాంకుల ఏటీఎం కార్డు దారులు వినియోగించుకోవొచ్చని సూచించారు. ఈ మొబైల్ ఏటీఎం వలన కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీఎం నాబార్డ్ వాసుదేవరావు, ఎల్డీఎం జయ సంతోష్ , తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ టి. రాజేందర్, బ్యాంక్ ఓసి లు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News