పెరిగిన మహీంద్రా వాహనాల ధరలు
దిశ,వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) తన వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలను 1.9 శాతం పెంచినట్టు శుక్రవారం ప్రకటించింది. కంపెనీని ఉత్పత్తి చేసే మోడల్, వేరియంట్‌ని బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని, అవి రూ. 4,500 నుంచి రూ. 40 వేల వరకు ఉన్నట్టు తెలిపింది. అదేవిధంగా గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 7 మధ్య బుకింగ్ చేసుకున్న కొత్త థార్ వాహనాలకు కూడా […]
దిశ,వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) తన వ్యక్తిగత, వాణిజ్య వాహనాల ధరలను 1.9 శాతం పెంచినట్టు శుక్రవారం ప్రకటించింది. కంపెనీని ఉత్పత్తి చేసే మోడల్, వేరియంట్‌ని బట్టి ఈ ధరల పెంపు ఉంటుందని, అవి రూ. 4,500 నుంచి రూ. 40 వేల వరకు ఉన్నట్టు తెలిపింది. అదేవిధంగా గతేడాది డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాది జనవరి 7 మధ్య బుకింగ్ చేసుకున్న కొత్త థార్ వాహనాలకు కూడా ఈ ధరల పెంపు ఉన్నట్టు పేర్కొంది. అంతేకాకుండా శుక్రవారం నుంచి బుకింగ్‌లు జరిగే థార్ వాహనాలకు డెలివరీ సమయంలో ఉండే ధరలు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ ధరల పెంపునకు ముడిసరుకుల ధరలు, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటమే కారణమని, ధరలు తగ్గించడానికి అవసరమైన ప్రయత్నాలను చేసినట్టు ఎంఅండ్ఎం ఆటో విభాగం సీఎవో విజయ్ నక్రా చెప్పారు. ఇటీవల పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న ఇన్‌పుట్ ఖర్చులను అనుసరించి ఈ ధరల పెంపు నిర్ణయానికి వచ్చినట్టు ఆయన తెలిపారు.