ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి: ఎమ్మెల్సీ కవిత
దిశ, అంబర్ పేట్: ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రముఖ అధ్యాత్మికవేత్త పురిపండ శ్రీనివాస్ సౌజన్యంతో ముద్రించబడిన లక్ష హనుమాన్ చాలీసా సంపుటిలను కొండగట్టు హనుమాన్ దేవాలయంలో పంపిణీ చేయడం కోసం తీసుకు వెళ్తున్న వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు హనుమాన్ చాలీసా దోహదపడుతుందని అన్నారు. అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో శ్రీత్యాగరాయ గాన సభ అధ్యక్షుడు […]
దిశ, అంబర్ పేట్: ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రముఖ అధ్యాత్మికవేత్త పురిపండ శ్రీనివాస్ సౌజన్యంతో ముద్రించబడిన లక్ష హనుమాన్ చాలీసా సంపుటిలను కొండగట్టు హనుమాన్ దేవాలయంలో పంపిణీ చేయడం కోసం తీసుకు వెళ్తున్న వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు హనుమాన్ చాలీసా దోహదపడుతుందని అన్నారు. అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో శ్రీత్యాగరాయ గాన సభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ ఆయాచితం శ్రీధర్, బెవరేజ్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ దేవిప్రసాద్ పాల్గొన్నారు.