టీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్‌లో తనయ పేరేది?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికార పార్టీకి పెను సవాల్‌గా మారిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ లిస్ట్‌లో కల్వకుంట్ల కవిత పేరు లేక పోవడంతో అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. గత గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ తనయ విస్తృత పర్యటనలు, ప్రచారాలతో ఓటర్లను, ముఖ్యంగా మహిళలను ప్రత్యేకంగా ఆకర్షించిన విషయం తెలిసిందే. కవిత ప్రచారం చేసిన ఏరియాల్లో చాలా వరకు అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీనికి తోడు అప్పట్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకత, ప్రతిపక్షాల ప్రభావం […]

Update: 2020-11-20 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికార పార్టీకి పెను సవాల్‌గా మారిన గ్రేటర్‌ ఎన్నికల్లో ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌ లిస్ట్‌లో కల్వకుంట్ల కవిత పేరు లేక పోవడంతో అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. గత గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ తనయ విస్తృత పర్యటనలు, ప్రచారాలతో ఓటర్లను, ముఖ్యంగా మహిళలను ప్రత్యేకంగా ఆకర్షించిన విషయం తెలిసిందే.

కవిత ప్రచారం చేసిన ఏరియాల్లో చాలా వరకు అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీనికి తోడు అప్పట్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకత, ప్రతిపక్షాల ప్రభావం తక్కువగానే ఉందని చెప్పాలి. కానీ, ఈ సారి బీజేపీ పుంజుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం పై వ్యతిరేకత కూడా పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో పార్టీ అధిష్టానం కవితను స్టార్ క్యాంపెయినర్‌గా నియమించకపోవడం గమనార్హం.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఘన విజయంతో కేసీఆర్ తనయ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి చెందగా.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్‌గా మారాయి. అయితే, కవిత ప్రత్యక్ష రాజకీయాల ఎంట్రీతో గ్రేటర్‌లో కారు స్పీడ్‌ పెరుగుతోందని అందరూ భావించారు.

ఈ క్రమంలోనే అంచనాలకు తగ్గకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, కవిత సోషల్ మీడియాలో రెండు సార్లు ఓటర్లను ఉద్దేశిస్తూ వీడియోలను విడుదల చేశారు. టీఆర్ఎస్‌ హయాంలో అభివృద్ధి.. కారు గుర్తుకే మన ఓటు అంటూ పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో, పలువురి నామినేషన్ల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా కవిత కన్ఫామ్‌ అంటూ పలువురు నేతలు స్పష్టం చేశారు.

ఇక గ్రేటర్ ఎన్నికల్లో మూడు దఫాల్లో 150 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ.. ఆ కాసేపటికే స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌ను విడుదల చేసింది. కానీ, అందులో కేసీఆర్ తనయ కవిత పేరు లేదు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, తలసాని, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలు మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారు.

అయితే, అసలు కవిత పేరును ఎందుకు ఈ లిస్ట్‌లో ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న అన్నయ్య గ్రేటర్‌లో పెను సవాల్ ఎదుర్కొంటున్న వేళ కవిత కుడి భుజంగా మారుతారునుకుంటే అంచనాలు తలకిందులయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా గ్రేటర్‌ పోలింగ్‌కు 10 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ గ్యాప్‌లో ఎన్నికల ప్రచారంలో కవిత పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News