ఊరంతా ఒకదారైతే.. కాంగ్రెస్‌ది మరోదారి: ఎమ్మెల్సీ
దిశ, న్యూస్‌బ్యూరో: ఓ వైపు కరోనాపై లోకమంతా ఏకతాటిపై పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయం చేస్తోందని ‘ఊరందరిదీ ఒక ఒకదారైతే తమది మరోదారి’ అన్నట్టుగా టీపీసీసీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. గురువారం మీడియ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విపత్కర సమయంలో జీతాల చెల్లింపు వాయిదాను ప్రభుత్వ ఉద్యోగులు సమర్థిస్తుంటే, ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాత్రం ఇప్పుడు జీతాలు చెల్లించాల్సిందేనని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలీసులు, వైద్య సిబ్బందికి […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఓ వైపు కరోనాపై లోకమంతా ఏకతాటిపై పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయం చేస్తోందని ‘ఊరందరిదీ ఒక ఒకదారైతే తమది మరోదారి’ అన్నట్టుగా టీపీసీసీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. గురువారం మీడియ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విపత్కర సమయంలో జీతాల చెల్లింపు వాయిదాను ప్రభుత్వ ఉద్యోగులు సమర్థిస్తుంటే, ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాత్రం ఇప్పుడు జీతాలు చెల్లించాల్సిందేనని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలీసులు, వైద్య సిబ్బందికి వంద శాతం వేతనాలు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. అంతేకాకుండా వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడో టీఎంసీ నీళ్లను తరలించేందుకు టెండర్లను పిలవడాన్ని ఉత్తమ్ వ్యతిరేకించడం.. అవగాహనా రాహిత్యమే తప్ప మరొకటి కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. కేంద్ర ఆర్థిక సంస్థలు, బ్యాంకుల రుణాలతో నడుస్తున్న ప్రాజెక్టని ఉత్తమ్‌కి తెలియదా అని ప్రశ్నించారు. పనుల పురోగతిని బట్టే ప్రాజెక్టులకు అప్పులు వస్తాయని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు తెలంగాణ అంతటికీ నిర్దేశిత లక్ష్యం ప్రకారం అందాలంటే ప్రాజెక్టు పనులు ఆగకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులపై రాజకీయాలు ఆపితే మంచిదని హెచ్చరించారు.
Tags: Congress, Kaleshwaram, MLC, Uttam Kumar Reddy, Employees salaries