ఆయన స్థానంలో రాజ్యసభకు కవిత.. ఎమ్మెల్సీగా ఆకుల లలిత..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ రాజకీయాలపై పట్టు సాధించాలని తహతహలాడుతున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందన్న చర్చ జోరందుకుంది. రెండోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకొని మంత్రి కావాలనుకున్న ఆశలకు గండిపడిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ఢిల్లీ రాజకీయాల వైపు కవిత వెళ్తున్నారంటూ పార్టీలో చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకు గవర్నర్ కోటా లేదా తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ద్వారా చట్టసభకు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ రాజకీయాలపై పట్టు సాధించాలని తహతహలాడుతున్న నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందన్న చర్చ జోరందుకుంది. రెండోసారి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకొని మంత్రి కావాలనుకున్న ఆశలకు గండిపడిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ఢిల్లీ రాజకీయాల వైపు కవిత వెళ్తున్నారంటూ పార్టీలో చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకు గవర్నర్ కోటా లేదా తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ద్వారా చట్టసభకు వెళ్లడం ఖాయమనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే, మంత్రి పదవిపై ఆమె పెట్టుకున్న ఆశలకు ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికలలో అధికార పార్టీ ఓటమి, రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇతరులకు మంత్రి వర్గంలో స్థానం ఇస్తుండటంతో ఆమెకు మిస్ అయిందనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్‌కు అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకుని మంత్రి పదవి ఇస్తారని.. అక్కడ ఖాళీ అయ్యే స్థానంలో కవితను ఢిల్లీ రాజకీయాలకు ప్రమోషన్ ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఎమ్మెల్సీగా కవిత పదవి కాలం జనవరి వరకు ఉండగా, నిజామాబాద్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ అసంతృప్త నేత ధర్మపూరి శ్రీనివాస్ స్థానం రెండు, మూడు నెలల్లో ఖాళీ కానుంది. ఆస్థానం నుంచైనా కవితను ఢిల్లీ రాజకీయాల వైపు మళ్లిస్తున్నారనే చర్చ కుడా జరుగుతున్నది.
ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో చట్టసభకు వేళ్లే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా మంగళవారం ఖరారు కాగా, గవర్నర్ కోటా, నిజామాబాద్ స్థానిక సంస్థల క్యాండిడేట్ ఎవరు అనేది సీఎం కేసీఆర్ ఖరారు చేయలేదు. ఇప్పటికే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమై 48 గంటలు గడిచినా అధికార పార్టీ నిజామాబాద్ క్యాండిడేట్‌పై కేసీఆర్ నిర్ణయం తీసుకోకపోవడంతో కవిత ఢిల్లీ రాజకీయాల వ్యవహరంపై జోరుగా పార్టీలో, ప్రజల్లో చర్చ జరుగుతోంది.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కవిత రాజ్యసభ సభ్యురాలిగా వెళ్తే ఆస్థానం మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు దక్కుతుందనే ఉహాగానాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీని మధ్యలో విరమించుకొని సిట్టింగ్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్‌లో చేరినప్పుడే ఆకుల లలితకు మరోసారి ఎమ్మెల్సీ స్థానం ఖాయమని అప్పట్లో చర్చ జరిగింది. అయితే, మంగళవారం నాటి ఎమ్మెల్యే కోటాలో ఆమె పేరు మిస్ కావడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ విషయం తీవ్ర చర్చకు దారి తీసింది.
రాజ్యసభకు కవితను పంపితే ఆమె స్థానంలో లలితకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఖాయమంటున్నారు నేతలు. జిల్లాలో ఎమ్మెల్సీ సీట్‌పై పెట్టుకున్న ఆశలు ఆవిరి కావడంతో జిల్లాలో సీనియర్ నేతల్లో నైరాశ్యం అలుముకుంది. అయితే, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ ఖర్చుతో కూడుకున్నది. అది భరించే శక్తి ఉన్న వారికే సీటు ఇస్తారనే చర్చ జోరందుకుంది. ఇదిలా ఉండగా కవిత విషయంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారోననే చర్చ ఊపందుకుంది.