ఎమ్మెల్యే సీతక్క హౌస్ అరెస్ట్

దిశ, వరంగల్: ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క పోలీసుల వైఖరికి నిరసనగా క్యాంప్ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలాపునే గోదావరి ఉన్న త్రాగటానికి నీళ్ళు లేవని, ములుగు నియోజకవర్గం గుండా గోదావరి జలాలు సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు తీసుకుపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమని, దీనికి […]

Update: 2020-06-02 00:50 GMT

దిశ, వరంగల్: ములుగు ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క పోలీసుల వైఖరికి నిరసనగా క్యాంప్ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలాపునే గోదావరి ఉన్న త్రాగటానికి నీళ్ళు లేవని, ములుగు నియోజకవర్గం గుండా గోదావరి జలాలు సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు తీసుకుపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమని, దీనికి నిరసనగా టీపీసీసీ ఆదేశాల మేరకు చేపట్టిన జల దీక్షను అడ్డుకోవడం ముఖ్యమంత్రికి తగదన్నారు. అక్రమ అరెస్ట్ లతో దీక్షను అడ్డుకోలేరని ఆమె ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Tags:    

Similar News