తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ లేదు: సీతక్క

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌ ఉపఎన్నిక రాగానే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువచ్చారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేసిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షాలు  సభలు పెడితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ అడ్డుకునేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మీడియా వాస్తవాలను చూపించకుండా ఒత్తిడి చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. […]

Update: 2021-08-10 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్‌ ఉపఎన్నిక రాగానే సీఎం కేసీఆర్‌కు ప్రజలు గుర్తుకువచ్చారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంగళవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇంద్రవెల్లి సభను సక్సెస్ చేసిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాసంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షాలు సభలు పెడితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్‌ అడ్డుకునేందుకు చర్యలు చేపట్టడం దారుణమన్నారు. తెలంగాణలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మీడియా వాస్తవాలను చూపించకుండా ఒత్తిడి చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. త్వరలోనే టీఆర్ఎస్ పాలన, కేసీఆర్‌ను గద్దె దించుతామని హెచ్చరించారు.

Tags:    

Similar News