దండం పెడుతున్నా.. మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోండి : సీతక్క

దిశ, ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే సీతక్క సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నది ఉద్యోగాలు కల్పించడానికా? తొలగించడానికా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి, తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. ‘దండం పెట్టి అడుగుతున్నా.. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకొని వారి కుటుంబాలను ఆదుకోండి’ అని కోరారు. 2006 ఉపాధి హామీ […]

Update: 2021-10-08 05:57 GMT

దిశ, ములుగు: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మెల్యే సీతక్క సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపుపై మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నది ఉద్యోగాలు కల్పించడానికా? తొలగించడానికా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి, తిరిగి వారిని విధుల్లోకి తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. ‘దండం పెట్టి అడుగుతున్నా.. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకొని వారి కుటుంబాలను ఆదుకోండి’ అని కోరారు. 2006 ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తీసుకురావడం జరిగిందని గుర్తుచేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం విధుల నుండి తొలగించడంతో 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో మరణించిన 52 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.

Tags:    

Similar News