సీఎం కీలక నిర్ణయం.. కేబినెట్ లో ఆయనకు మళ్లీ చోటు!

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో కొత్త కేబినెట్ ఇవాళ కొలువుదీరనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, చరణ్ జిత్ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారనేది చర్చనీయాంశమైంది. మంత్రులెవరెవరూ అన్నది ఫైనల్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ.. రాహుల్ గాంధీతో […]

Update: 2021-09-26 00:59 GMT

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఆధ్వర్యంలో కొత్త కేబినెట్ ఇవాళ కొలువుదీరనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, చరణ్ జిత్ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారనేది చర్చనీయాంశమైంది. మంత్రులెవరెవరూ అన్నది ఫైనల్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ.. రాహుల్ గాంధీతో మూడు దఫాలుగా భేటీ అయినట్లు సమాచారం.

అయితే, చరణ్ జిత్ కేబినెట్ లో ఏడుగురు కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నారని, అదేవిధంగా ఎమ్మెల్యే రాణా గుర్జీత్ సింగ్‌ కి కూడా మరోసారి మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే, రాణా గుర్జీత్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను అమరీందర్ సింగ్ బర్తరఫ్ చేశారు. అయితే, ఇప్పుడు చరణ్ జిత్ కేబినెట్ లో మళ్లీ ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశముందని తెలియడంతో “ఇదేంటీ.. ఆయన తొలగించడం ఈయన మళ్లీ ఛాన్స్ ఇవ్వడంలో వాటీజ్ ది మేటర్” అంటూ ఆ రాష్ట్ర ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.

Tags:    

Similar News