కోటి ఉద్యోగాలు ఎక్కడ..? ఎమ్మెల్యే రాజయ్య ప్రశ్న
దిశ, స్టేషన్ ఘన్ పూర్: ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ప్రశ్నించారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అనేక పథకాలను అమలు చేస్తూ దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో […]
దిశ, స్టేషన్ ఘన్ పూర్: ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ప్రశ్నించారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన అనేక పథకాలను అమలు చేస్తూ దేశంలో ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. కోటి ఉద్యోగాలు ఇవ్వకపోగా, రైతులను దగా చేసే చట్టాలు తెచ్చిందని ధ్వజమెత్తారు.
గడిచిన ఏడేళ్లలో కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. ప్రజా సంగ్రామ పాదయాత్రకు ఒకరు, ప్రజా ఆశీర్వాద యాత్రకు మరొకరు రాష్ట్రంలో తిరిగి ప్రజలకు ఏమి చెబుతున్నారని ప్రశ్నించారు. దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇదే సమయంలో దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాలకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూడా డైరెక్టర్ కుమార్, ఎంపీపీలు రేఖ, జయశ్రీ, సమ్మిరెడ్డి, సుదర్శన్ జడ్పీటీసీలు రవి, బేబీ, వంశీధర్ రెడ్డి, అజయ్, సరిత, శ్రీలత సర్పంచులు సురేష్ కుమార్, సోమిరెడ్డి, రాజ్ కుమార్, గణపతి తదితరులు పాల్గొన్నారు.