లారీలు తెప్పించండి.. కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే
దిశ, స్టేషన్ ఘన్ పూర్: కొనుగోలు కేంద్రాల్లో నుంచి ధాన్యం తరలించేందుకు లారీలు తెప్పించండని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య జిల్లా కలెక్టర్‌ను కోరారు. మిల్లుకు వెళ్లిన ధాన్యాన్ని తిరిగి పంపించిన మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో రైతుల నుండి లారీలు రావడంలేదని, మిల్లుకు వెళ్ళిన ధాన్యాన్ని తిరిగి పంపించాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఆయన […]
దిశ, స్టేషన్ ఘన్ పూర్: కొనుగోలు కేంద్రాల్లో నుంచి ధాన్యం తరలించేందుకు లారీలు తెప్పించండని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య జిల్లా కలెక్టర్‌ను కోరారు. మిల్లుకు వెళ్లిన ధాన్యాన్ని తిరిగి పంపించిన మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం స్టేషన్ ఘన్ పూర్ మండలం పామునూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
ఈ క్రమంలో రైతుల నుండి లారీలు రావడంలేదని, మిల్లుకు వెళ్ళిన ధాన్యాన్ని తిరిగి పంపించాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ నిఖిలతో ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోతి రేణుక రాములు, ఎంపీటీసీ ఇనుగాల రజిత రాజిరెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ సురేందర్ రెడ్డి, ఎంపీడీఓ కుమారస్వామి, ఏవో నాగరాజు, డిటి జయచందర్, ఏపీఎం కవిత, ఏఈఓ కార్తిక్, సీసీ ఉమా తదితరులు పాల్గొన్నారు.