ఏదో జరిగింది.. యాంకర్ రవి ఎలిమినేషన్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: బిగ్‌బాస్ షోతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతూ ప్రజల మధ్య వర్గ విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. అలాంటి షోను తెలంగాణలో నిర్వహించవద్దని, బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం వెనుక ఏదో జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య […]
దిశ, తెలంగాణ బ్యూరో: బిగ్‌బాస్ షోతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతూ ప్రజల మధ్య వర్గ విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. అలాంటి షోను తెలంగాణలో నిర్వహించవద్దని, బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యి బయటకు రావడం వెనుక ఏదో జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ ను రగిల్చి రెచ్చగొడుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. బిగ్ బాస్ షోను చిన్న పిల్లలు, మహిళలు చూడలేకపోతున్నారన్నారు. హిందూ దేవుళ్లను సైతం బిగ్ బాస్ లో కించపరుస్తూ వ్యాఖ్యానించడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు. అన్ని భాషల్లో ఉన్న బిగ్ బాస్ షోలను బ్యాన్ చేయాలని కేంద్ర హోం మంత్రికి లేఖ రాస్తానని ఆయన తెలిపారు.