టీఆర్ఎస్ నాయకులకు ఇది అలవాటైపోయింది : ఎమ్మెల్యే రాజాసింగ్

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఓటమిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైకోర్టులో కేసుకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పై విజయం సాధించినట్లు తెలిపారు. అయితే ఆయన టీఆర్ఎస్ నాయకుల మాదిరిగా కోర్టులలో కేసులు పెట్టకుండా హుందాగా వ్యవహరించారని అన్నారు. 2018లో జరిగిన ఎన్నికలలో ఓటమి […]

Update: 2021-08-28 07:26 GMT

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : ఓటమిని జీర్ణించుకోలేక టీఆర్ఎస్ నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైకోర్టులో కేసుకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తాను ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పై విజయం సాధించినట్లు తెలిపారు.

అయితే ఆయన టీఆర్ఎస్ నాయకుల మాదిరిగా కోర్టులలో కేసులు పెట్టకుండా హుందాగా వ్యవహరించారని అన్నారు. 2018లో జరిగిన ఎన్నికలలో ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, గతంలో మాజీ మంత్రి రామస్వామి విజయం సాధించిన సందర్భంలో కూడా ఆయన ఇలాగే కేసులు పెట్టారని చెప్పారు.

ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన అనంతరం తప్పుడు కేసులు పెట్టడం వారికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. తనకు చట్టం, న్యాయంపై నమ్మకం ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. హైకోర్టులో కేసు విచారణలో ఉన్నందున బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనలేకపోయానని అన్నారు. ఆదివారం జరిగే పాదయాత్రలో రోజంతా బండి సంజయ్ వెంట ఉండనున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News